Vijaya Sai Reddy: కేసుల నుంచి విముక్తి అంత తేలిక కాదు
Vijaya Sai Reddy: కేసుల నుంచి బయటపడటం అంత తేలిక కాదు అని అంటున్నారు YSRCP ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన చేసిన ఈ కామెంట్ ఎవరి గురించో కాదు.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గురించి. చంద్రబాబు నాయుడు ఈసారి భారతీయ జనతా పార్టీ, జనసేనలతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే.
ఇది ఎప్పటినుంచో తెలిసిందే కదా ఇప్పుడెందుకు విజయ సాయి రెడ్డి కామెంట్ చేసారు అనుకుంటున్నారా? ఎందుకంటే.. ఈరోజు మధ్యాహ్నం నెల్లూరులో విజయ సాయి రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తే చాలా మంది జనాలు ఆయన మాట్లాడుతుండగానే మధ్యలో లేచి వెళ్లిపోయారు. భోజనాలు ఉన్నాయి.. పెద్దాయన మాట్లాడుతున్నాడు ఉండండి అని రిక్వెస్ట్ చేసినా కూడా వారు వినకుండా వెళ్లిపోయారు.
ఈ అంశాన్ని తెలుగు దేశం, జనసేన పార్టీలు బాగా వాడుకున్నాయి. చూడు ప్రజలు ఎలా వెళ్లిపోతున్నారో అంటూ వీడియోలు పోస్ట్ చేసి మరీ విజయ సాయిరెడ్డిని టార్గెట్ చేసారు. దాంతో విజయసాయి రెడ్డికి ఒళ్లు మండింది. అందుకే చంద్రబాబు నాయుడుపై ట్వీట్ చేసారు. “” మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా గెలుపుపై చంద్రబాబు గారికి రవ్వంత కూడా నమ్మకం లేదు. తనపైన, పుత్రరత్నం లోకేశ్ పై ఉన్న అవినీతి కేసుల నుంచి రక్షణ కోసమే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎన్డీఏలోకి జొరబడ్డారు. బిజెపి రక్షణ ఉంటే జైలుకు వెళ్లే బాధ తప్పుతుందని ఆయన ఆశ. కానీ చట్టం ఎక్కడున్నా వదిలిపెట్టదు. దోపిడీ కేసుల నుంచి విముక్తి అంత తేలిక కాదు“” అని అన్నారు.
ALSO READ: విజయసాయి రెడ్డికి ఘోర అవమానం