Vijaya Sai Reddy: అందుకే వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పాం
Vijaya Sai Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) చనిపోయారన్న విషయం బయటికి వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మీడియా ఛానెల్లో కూడా ఇదే రాసారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డికి సహజ మరణం కాదు హత్య అని తేలింది. వివేకా భౌతికకాయానికి పోస్ట్మార్టెం జరగక ముందే గుండెపోటు అని ఎందుకు అనౌన్స్ చేసారు అనే అంశంపై ఓ టీవీ డిబేట్లో స్పందించారు విజయ సాయి రెడ్డి.
వివేకా చనిపోయినప్పుడు తనకు పులివెందుల నుంచి ఓ విలేకరి ఫోన్ చేసారని.. వివేకా చనిపోయారని చెప్పారని అతని ద్వారానే తెలిసిందని విజయ సాయి రెడ్డి అన్నారు. ఆ తర్వాత పులివెందులతో తనకు తెలిసినవారికి ఫోన్ చేసి ఆరా తీయగా.. వారు గుండెపోటుతో చనిపోయారని చెప్పారని.. తనకు అందిన మొదటి సమాచారం అదే కాబట్టి తాను కూడా మీడియా ముందు గుండెపోటుతో చనిపోయారని చెప్పానని.. అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదని వెల్లడించారు. ఈ ఎన్నికల తర్వాత తన కుమార్తెను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని అనుకుంటున్నానని.. ఏ ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని తన ఆకాంక్షను బయటపెట్టారు.