Vijay: తాగి నా ఈవెంట్‌కి రావ‌ద్దు

vijay wants party cadre not to drink and come to event

Vijay: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళగ వెట్రి క‌జ‌గం అనే పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. అక్టోబ‌ర్ 27న తొలిసారి స్టేట్ కాన్ఫ‌రెన్స్‌ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటుచేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు, ఫ్యాన్స్ వంద‌లాది సంఖ్య‌లో వ‌స్తార‌ని ఆశిస్తున్న విజ‌య్‌.. వారిని ఓ రిక్వెస్ట్ చేసారు. ఒక‌వేళ కార్య‌క్ర‌మానికి వ‌చ్చే స‌మ‌యంలో ఎవ‌రైనా తాగి ఉన్నా.. బైక్‌ల‌తో స్టంట్స్ చేయాల‌ని చూసినా వారెవ్వ‌రూ కూడా త‌న కార్య‌క్ర‌మానికి రావ‌ద్ద‌ని కోరారు. వారి వ‌ల్ల కార్య‌క్ర‌మంలో ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తే త‌న పార్టీకి చెడ్డ‌పేరు వ‌స్తుంద‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.