Vijay: తమిళ స్టార్ కొత్త పార్టీ..?
Chennai: తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ (vijay) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. అయితే ఆయన ఆల్రెడీ ఉన్న పార్టీలలో కాకుండా సొంతంగా పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత విజయ్ తన పార్టీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయట. 2026లో విజయ్ (vijay) నేరుగా బరిలోకి దిగి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కళ్ ఇయక్కం అనే ఫ్యాన్స్ ఆర్గనైజేషన్‌ను పొలిటికల్ పార్టీగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫ్యాన్స్ అంతా కలిసి తమిళనాడులోని ఒక్కో జిల్లా నుంచి సర్వేలు సేకరిస్తున్నారు.
ప్రజల అవసరాలు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఇలా అన్నీ రిపోర్ట్ తయారుచేసి పెట్టుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. 2009లోనే విజయ్ తండ్రి చంద్రశేఖర్ పొలిటికల్ ప్లాన్స్ గురించి బయటపెట్టారు. DMK పార్టీ సపోర్టర్ అయిన చంద్రశేఖర్.. తన తండ్రే కాబోయే తమిళనాడు (tamilnadu) సీఎం అని అప్పట్లోనే ప్రకటించారు. అయితే అప్పటికి విజయ్‌కి రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేదు. గతేడాది విజయ్ (vijay)తన ఫ్యాన్స్‌లో కొందరిని స్థానిక గ్రామీణ ఎన్నికల్లో పోటీ చేయించినట్లు తెలుస్తోంది. వాళ్లు 100 సీట్లు గెలుచుకున్నారట. అయితే అందరు హీరోలకు పొలిటికల ఎంట్రీ సక్సెస్ ఇవ్వదని ఈ విషయంలో విజయ్ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.