VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే త‌గ్గించుకుంటున్నావ్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) షాకింగ్ కామెంట్స్ చేసారు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత వీహెచ్ హ‌నుమంత రావు (VH). రేవంత్ త‌న స్థాయిని తానే త‌గ్గించుకుంటున్నాడ‌ని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక‌ ముఖ్యమంత్రని.. ఆయ‌న్ను కలవాలంటే అంద‌రూ ఆయ‌న‌ దగ్గరకు రావాలి కానీ ఆయ‌నే వాళ్ళ వ‌ద్ద‌కు వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదని అన్నారు. రేవంత్ రెడ్డిని క‌లిసి ఇదే విష‌యం చెబుదామంటే ఆయ‌న టైం ఇవ్వడంలేద‌ని తెలిపారు. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే అని పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడని అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నార‌ని పేర్కొన్నారు.

భారత రాష్ట్ర సమితి (BRS) నేత‌లు ఆ పార్టీలో ఉన్న‌ప్పుడు బాగా సంపాదించుకుని ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వ‌స్తున్నార‌ని అనిపిస్తోంది.. వారిని కేసీఆరే పంపుతున్నారేమో అన్న సందేహం ఉంద‌ని వీహెచ్ అంటున్నారు. ఒక సైడ్ మాత్ర‌మే కాకుండా రెండు వైపులా వాద‌న‌లు విని అప్పుడు సీట్లు ఇస్తే బాగుంటుంద‌ని.. గ‌తంలో జ‌రిగిన అంశ‌మే మ‌ళ్లీ రిపీట్ కావొద్ద‌ని మాత్రమే సూచిస్తున్నాన‌ని అన్నారు.