Varla Ramaiah: జగన్.. పిన్నెళ్లి నిన్ను కూడా ఏసేస్తాడు
Varla Ramaiah: ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి చిన్నవాడు ఏంటయ్యా జగన్.. దొరికితే నిన్ను కూడా ఏసేస్తాడు అని అన్నారు తెలుగు దేశం పార్టీ నేత వర్ల రామయ్య. పిన్నెళ్లి లాంటి వాడికి టికెట్ ఇచ్చి ఇంకా ప్రోత్సహిస్తున్న జగన్ కూడా నేరస్తుడే అని ఆయన అభిప్రాయపడ్డారు. పిన్నెళ్లి చేసిస ప్రతి నేరంలో జగన్ హస్తం ఉందని.. జగన్ ప్రోత్భలంతోనే ఆయన హామీతోనే పిన్నెళ్లి మాచర్లలో భయానక వాతావరణం సృష్టించాడని అన్నారు. అసలు పిన్నెళ్లిపై ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు. బోండా ఉమ, బుద్ధా వెంకన్నను చంపేయాలని చెప్పింది కూడా పిన్నెళ్లే అని ఆ విషయాన్ని కోర్టులో ఎందుకు చెప్పలేదని పోలీసులను ప్రశ్నించారు.