Varahi Yatra సెకండ్ షెడ్యూల్ ఫిక్స్!

AP: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్  (pawan kalyan) చేయ‌బోయే వారాహి విజయ యాత్ర (varahi yatra) తదుపరి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభను నిర్వ‌హిస్తారు. గురువారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాత్ర నిర్వహణపై పవన్ కళ్యాణ్‌తో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) చ‌ర్చించారు. వారాహి మొద‌టి షెడ్యూల్ ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.