జగన్ గురించి తెలిసే షర్మిళ, విజయమ్మకు సెక్యూరిటీ ఇస్తున్నాం
Vangalapudi Anitha: తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ మోహన్ రెడ్డి తన చెల్లి షర్మిళ, తల్లి విజయమ్మలను ఏమైనా చేస్తాడేమో అనే అనుమానం ఉండేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత. సరస్వతి కంపెనీలో తాను షేర్లు కొని విజయమ్మకు కానుకగా ఇస్తే షర్మిళ మోసం చేసి తన పేరిట బదిలీ చేయించుకుందంటూ జగన్ నేషనల్ లా కంపెనీ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణ నవంబర్‌లో జరగనుంది.
అంతేకాదు.. షర్మిళపై ప్రేమతోనే రూ.200 కోట్ల మేర ఆస్తి పంచానని.. అయినా తనపై విశ్వాసం చూపకుండా రాజకీయంగా దెబ్బకొట్టాలని చూసిందని జగన్ షర్మిళకు లేఖ రాయడం సంచలనంగా మారింది. తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచాలంటే ముందు తనకు రాజకీయంగా మద్దతు తెలపాలని.. తన గురించి తన భార్య భారతి గురించి అవినాష్ రెడ్డి గురించి తప్పుగా ప్రచారం చేయడం మానుకుంటే అప్పుడు ఆస్తి ఇస్తానని కూడా లేఖలో పేర్కొన్నారు. దీనిపై అనిత స్పందించారు. తాము ప్రతిపక్షంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడే షర్మిళ, విజయమ్మలకు థ్రెట్ ఉందని ఊహించానని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌కి భద్రత తీసేసాడని.. కానీ షర్మిళ, విజయమ్మలకు మాత్రం తమ ప్రభుత్వం ఇప్పటికీ రక్షణ కల్పిస్తోందని అన్నారు.