Vangalapudi Anitha: YSRCPకి వాపుకి బలుపుకి తేడా తెలీనట్లుంది
Vangalapudi Anitha: వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వాపుకి బలుపుకి తేడా తెలీకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నుంచి కూటమి ప్రభుత్వం తప్పుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అనిత క్లారిటీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీ ఎన్నికలు వస్తే.. అప్పుడు తమను నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురిచేసారని.. దాంతో తాము ఆ ఎంపీటీసీ ఎన్నికలను బాయ్‌కాట్ చేసామని అన్నారు. ఈరోజు తాము అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఆరోజు ఎన్నికల నుంచి తప్పుకుని ఈరోజు పాల్గొనడం నైతికత కాదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో తాము ఎన్నికల నుంచి తప్పుకున్నామే తప్ప వైఎస్సార్ కాంగ్రెస్‌కి భయపడి కాదని స్పష్టతనిచ్చారు.
కానీ వాపుకి బలుపుకి తేడా తెలీని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈరోజు బయటికి వచ్చి తెలుగు దేశం పార్టీ తమకు భయపడి ఎన్నికల నుంచి తప్పుకుందని వాగుతున్నారని వారంతా ఒక్కసారి చరిత్ర గుర్తుచేసుకోవాలని అన్నారు. తమకు ప్రతిపక్ష హోదాను కూడా తీసేస్తామని ప్రగల్భాలు పలికారని కానీ ఈరోజు అదే పార్టీ 11 సీట్లకే పరిమితం అయ్యారని గుర్తుచేసారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు శాసన మండలిని వద్దన్నారని.. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని బొత్స చేత నామినేషన్ వేయించారని ప్రశ్నించారు.