రేణూ దేశాయ్‌ని అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు?
YSRCP మంత్రి రోజాపై (roja) TDP మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి (bandaru) చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే పలువురు సీనియర్ హీరోయిన్స్ స్పందించిన సంగతి తెలిసిందే. ఎంపీ, నటి నవనీత్ కౌర్, ఖుష్బూ, రాధిక రోజాకు సపోర్ట్‌గా నిలిచారు. బండారుపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. రోజా గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్ (renu desai) ఎవరితో పడుకుందో బయటపెట్టండి అని మాట్లాడిందని.. మారి ఆ సమయంలో ఈ నటీమణులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు TDP నేత వంగలపూడి అనిత (vangalapudi anitha). సపోర్ట్ చేస్తే అందరు మహిళలకు చేయాలి కానీ ఏదో ఒకప్పుడు సినిమాల్లో తమతో పాటు నటించిందన్న ఒక్క కారణంతో అసలు లాజిక్ లేకుండా రోజాను సపోర్ట్ చేయడం సబబు కాదని అన్నారు. ఇప్పుడు రోజాను సపోర్ట్ చేస్తున్న వారిపై ప్రజల్లో అసహ్యం పెరిగిపోతోందని.. ఆమెకు సపోర్ట్ చేస్తున్నవారికి సిగ్గుండాలని అన్నారు.