Vallabhaneni Balasouri: ఆ రెండూ పవన్ గుండెచప్పుళ్లు
Vallabhaneni Balasouri: YSRCP మాజీ నేత వల్లభనేని బాలశౌరి ఈరోజు జనసేనలో (janasena) చేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోందంటే టికెట్ కోసం క్యూలో నిల్చుంటే ఎలాగైతే ఫ్యాన్స్కి ఊపిరాడతో.. తన పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉందని చమత్కరించారు.
ప్రజా సేవలోనూ క్రేజీ స్టారే
ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ అటూ సినిమాల్లోనూ పవన్ క్రేజీ స్టారే.. ఇటు ప్రజలకు సేవ చేయడంలోనూ క్రేజీ స్టారే అని అన్నారు. “” రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. అభివృద్ధి అనేది కనిపించడంలేదు. నేను 2004లో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి ఎంపీగా నేను, తెనాలి అభ్యర్ధిగా నాదెండ్ల మనోహర్ కలిసి పనిచేసాం. ఆ 5 సంవత్సరాలు ఎంతో తృప్తినిచ్చింది. ఆరోజు మంగళగిరి, తెనాలికి కావాల్సిన పులిచింతల ప్రాజెక్ట్ను పూర్తి చేసుకోగలిగాం. తాగు నీరు తెచ్చాం. కానీ ఈరోజు కృష్ణా డెల్టాకి తాగు, సాగు నీరు అందడంలేదు. పులిచింతల ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు “” అని తెలిపారు.
ఆ రెండూ పవన్ గుండెచప్పుళ్లు
మొన్న పవన్ను కలిసి పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నప్పుడు కృష్ణా అనేది మనకు అష్యూర్డ్ నీళ్లు కావు గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరొస్తేనే ఈ ఏపీ రాష్ట్రంలో దాదాపు సగ భాగం సేవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ను మనం పూర్తి చేసుకోవాలని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చిందని తెలిసిందే. దానిని మూలన పడేసారు. అధికారంలో ఉన్న YSRCPకి 22 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. 10 రాజ్యసభ స్థానాలు ఉన్నప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను దక్కించుకోగలిగామా అని పవన్ నాతో చెప్పారు. ఈ రెండు విషయాలు పవన్ చర్చిస్తుంటే పోలవరం ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేవి పవన్ గుండెచప్పుడు అనిపించింది “” అంటూ జనసేనానిని పొగడ్తలతో ముంచెత్తారు బాలశౌరి.