V Hanumanth Rao: అధికారంలోకి వచ్చేది BJPనే..!
Hyderabad: మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది BJPనే అని అంటున్నారు కాంగ్రెస్ (congress) సీనియర్ నేత వి హనుమంత్ రావు (v hanumanth rao). కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేయడం ఏంటి అని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) ఎలాగైనా BJPని పంపించేయాలని కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడుతోంది. ఇందుకోసం ఓ అపోజిషన్ కూటమిని (INDIA) కూడా ఏర్పాటుచేసుకుంది. అలాంటిది ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు వారిని గైడ్ చేయాల్సిందిపోయి ఇలా ప్రతిపక్ష పార్టీ గెలుస్తుందంటూ పబ్లిక్‌గా ఒప్పేసుకోవడం ఏంటో వారికే తెలియాలి.