BRS పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి!!!

Hyderabad: న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kuar reddy).. BRS పార్టీలో చేర‌తార‌ని తెలుస్తోంది. గత కొంతకాలంగా TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) మీద  ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) కోపంగా ఉన్నారు. తన మీద కాంగ్రెస్ (congress) పార్టీ వార్ రూంలో ట్రోల్ వీడియోస్ చేయిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డిని విమ‌ర్శించారు. దీనికి తోడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక విషయంలో కోమటిరెడ్డి , ఉత్తమ్ కోపంగా ఉన్నారు. దాంతో కోమటిరెడ్డి ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దకు మాత్రం వెళ్ళలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా చేరుతారనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.