Uttam Kumar Reddy: సీఎం అయ్యారు… కానీ సినిమాలో..!

Uttam Kumar Reddy: తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వ‌గానే రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎవ‌రు అనేదానిపైనే చ‌ర్చంతా నెలకొంది. ముందు నుంచీ తెలంగాణ‌లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన రేవంత్ రెడ్డి (revanth reddy) పేరే వినిపించింది కానీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వంటి సీనియ‌ర్లు ఉండ‌టంతో ఎక్క‌డ రేవంత్‌ని సీఎం చేస్తే వారు చిన్న‌బుచ్చుకుంటారో అనే టెన్ష‌న్‌లో కాంగ్రెస్ ఉంది. మొత్తానికి హైక‌మాండ్ అంద‌రికీ న‌చ్చ‌జెప్పి రేవంత్ రెడ్డిని సీఎంగా ప్ర‌క‌టించింది.

అయితే ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ముఖ్య‌మంత్రి కావాల‌న్న క‌ల రియ‌ల్ లైఫ్‌లో నెర‌వేర‌న‌ప్ప‌టికీ రీల్ లైఫ్‌లో నెరవేరింది. 2016లో శ్రీకాంత్ (srikanth) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన టెర్రర్ (terror) అనే సినిమాలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టించారు. ఉత్త‌మ్ న‌టించిన ఏకైక సినిమా ఇది. అయితే నిజ జీవితంలో మాత్రం ఉత్త‌మ్ సీఎం అవ్వ‌లేక‌పోయార‌ని ఆయ‌న స‌పోర్ట‌ర్లు, ఫ్యాన్స్ తెగ బాధ‌ప‌డుతున్నారు. క‌నీసం రీల్ లైఫ్‌లో అయినా ఆయ‌న సీఎం అయ్యారంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.