USA: చివరి క్షణంలో పాసైన బిల్లు.. ఉక్రెయిన్ గుండె గుభేలు..!
అమెరికా (usa) ప్రభుత్వం షట్‌డౌన్ అయిపోతుందేమో అనుకుంటున్న క్రమంలో చివరి క్షణంలో కాంగ్రెస్ ఓ బిల్లును ప్రవేశపెట్టింది. దాంతో షట్‌డౌన్ అవ్వకుండా తప్పించుకుంది. అయితే.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బిల్లులో ఉక్రెయిన్‌కు (ukraine) సహాయ నిధిని కూడా చేర్చాలని అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) కోరినప్పటికీ.. కాంగ్రెస్ ఇందుకు ఒప్పుకోలేదు. దాంతో ఇక అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు ఎలాంటి సహాయం అందదు.
ఇక ప్రభుత్వం షట్‌డౌన్ అవ్వడంలేదు కాబట్టి రానున్న 45 రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సాఫీగానే నడుస్తుంది. 45 రోజుల తర్వాత పరిస్థితి ఏంటనేది మళ్లీ చర్చిస్తారు. రిపబ్లికన్ పార్టీలోని రైట్ వింగ్ నేతలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ అగ్రీమెంట్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో నిన్నటితో ప్రభుత్వం షట్‌డౌన్ అవుతుందని అనుకున్నారు. వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు మాత్రం అమెరికా బడ్జెట్ అనేది అమెరికా లాభపడేలా ఉండాలి కానీ ఇతర దేశాలకు దాన ధర్మాలు చేసే విధంగా ఉండకూడదని అంటున్నారు. (usa)