Undavalli Arun Kumar: ఏపీలో అస‌లు YSRCP పార్టీనే లేదు

Undavalli Arun Kumar says there is no ysrcp party in andhra pradesh

Undavalli Arun Kumar:  ఆంధ్రప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేద‌ని అన్నారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలుగు దేశం పార్టీకి బ‌లం ఎక్కువ ఉంది కాబ‌ట్టి వారు ఎన్నిక‌ల్లో నిల‌దొక్కుకున్నార‌ని.. అస‌లు ఈరోజు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేద‌ని తెలిపారు. ఈ ఐదేళ్ల‌లో ముందు పార్టీని గ‌ట్టిగా బిల్డ‌ప్ చేసుకుంటే కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయడానికి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. పార్టీకి మంచి ప్ర‌జాప్ర‌తినిధులు ఉండాల‌ని.. ఇప్పుడున్న‌వారు కేవ‌లం మీడియా ముందుకు వ‌చ్చి బూతులు తిట్ట‌డం త‌ప్ప ఇంకేమీ చేయ‌డంలేద‌ని మండిప‌డ్డారు.