India Canada Issue: టెన్షన్లో UK, US..!
ఇండియా కెనడా దేశాల (india canada issue) మధ్య నెలకొన్న దౌత్య సమస్యల కారణంగా అమెరికా (us), యూకే (uk) టెన్షన్లో పడ్డాయి. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత భారత్‌కి కోపం వచ్చి ఇక్కడ నుంచి పనిచేస్తున్న కెనడా దౌత్యాధికారులను వెనక్కి పిలిపించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం.. ఈ నేపథ్యంలో నిన్న కెనడా దాదాపు 41 మంది దౌత్యాధికారులను వెనక్కి రప్పించుకోవడంపై అమెరికా, యూకే దిగులు చెందుతున్నాయి.
కెనడా భారత్‌పై చేసిన ఆరోపణలను అమెరికా, యూకే సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ హత్య కేసులో భారత్ హస్తం ఉందో లేదో తెలీడానికి కెనడా చేపట్టే విచారణలో పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాయి. భారత్ వియాన్నా కన్వెన్షన్ రూల్స్‌ని ఫాలో అవ్వాలని అంటున్నాయి. వియాన్నా కన్వెన్షన్ రూల్స్ ప్రకారం… ఒక దేశంలో ఇతర దేశాలకు చెందిన దౌత్యాధికారులు ఉంటే వారికి కచ్చితంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత వారు ఉంటున్న దేశానిదే. భారత్‌లో కెనడా దౌత్యాధికారులకు రక్షణ కల్పించడంలేదని అందుకే వారిని వెనక్కి పిలిపించుకున్నామని కెనడా ఆరోపణలు చేస్తోంది. విచిత్రం ఏంటంటే.. అమెరికా, యూకే భారత్ మాటలు మాత్రం నమ్మడంలేదు. కెనడా ఏం చెప్తే అది నమ్మేసి భారత్ రూల్స్ ఫాలో అవ్వడంలేదని నీతులు చెప్తున్నాయి. (india canada issue)
అమెరికా, యూకేకి ఇండియా కీలకమైన పార్ట్నర్. ఎందుకంటే ఈ మూడు దేశాలకు కామన్ శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది చైనానే (china). కాబట్టి కూర్చుని చర్చించుకోండి అని ఇరు దేశాలు పిలుపునిస్తున్నాయి.