Turkey: హిట్లర్‌లా ప్రవర్తిస్తున్నారు.. హిట్లర్ గతే పడుతుంది
Turkey: టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన్ను అడాల్ఫ్ హిట్లర్‌తో పోలుస్తూ చివరికి అతనికి కూడా హిట్లర్ గతే పడుతుందని అన్నారు. ఇజ్రాయెల్ లెబనన్‌లో చేస్తున్న దాడుల దృష్ట్యా ఎర్డోగన్ ఈ వ్యాఖ్యలు చేసారు. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దళాలు లెబనన్‌లో గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాయని.. అవి క్రమేఫా టర్కీకి విస్తరించే ప్రమాదం ఉందని అన్నారు. అదే జరిగితే టర్కీని టర్కీ ప్రజలను కాపాడుకోవడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని హెచ్చరించారు.
ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు కలిసి ఇజ్రాయెల్‌ను లెబనన్పై దాడులు చేయకుండా ఆపాలని అభ్యర్ధించారు. నెతన్యాహూ విస్తరణవాద విధానాలు నాజీ జర్మనీ విధానాలతో సమానంగా ఉన్నాయని ఎర్డోగన్ మండిపడ్డారు. ఇదే జరిగితే నెతన్యాహుకు కూడా హిట్లర్ గతే పడుతుందని.. అంతదాకా రాకుండా ఐక్యరాజ్య సమితి 1950 రెజల్యూషన్ ప్రకారం ఇజ్రాయెల్ యాక్షన్లను ఇప్పటికిప్పుడు ఆపేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసారు.