Tula Uma: న‌న్ను అవ‌మానించారు.. పార్టీలో ఉండ‌లేను

Tula Uma: త‌న‌కు వేములవాడ టికెట్ ఇవ్వ‌నందుకు గానూ BJP పార్టీ స‌భ్య‌త్వానికి తుల ఉమ రాజీనామా చేసారు. బీసీ మ‌హిళ‌కు గౌర‌వం ఇవ్వ‌ని ఈ పార్టీ ఇక బీసీ అభ్య‌ర్ధిని సీఎం చేస్తామ‌ని ఎలా చెప్తోందో అర్థంకావ‌డంలేద‌ని రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. ఇలాంటి అవ‌మానాలు భ‌రించే ఓపిక త‌న‌కు లేద‌ని ఎమ్మెల్యే టికెట్‌తో త‌న‌కు వేముల‌వాడ ప్ర‌జ‌లతో ఉన్న అనుబంధాన్ని తెంచ‌లేరని తెలిపారు. త‌దుపరి కార్య‌చ‌ర‌ణ గురించి త‌న కార్య‌కర్త‌ల‌తో మాట్లాడి చెప్తాన‌న్నారు.