Congress: రేవంత్ రెడ్డికి పెరుగుతున్న నిర‌స‌న‌ సెగ‌

తెలంగాణ‌లో ఎన్నిక‌లు (telangana elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల హ‌డావిడి క‌న్నా TPCC అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి (revanth reddy) వ్య‌తిరేకంగా నిర‌స‌న సెగ ఎక్కువ‌వుతోంది. పార్టీలో (congress) ఎప్ప‌టినుంచో ఉన్న‌వారికి కాకుండా నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వారికి త‌న‌కు వ‌త్తాసు పలికే వారికి రేవంత్ సీట్లు కేటాయించాడంటూ ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది రేవంత్ ప్ర‌వ‌ర్త‌న‌తో విసిగిపోయి రాజీనామాలు చేసారు. రాజీనామాలు చేసిన‌వారిలో పొన్నాల ల‌క్ష్మ‌య్య కూడా ఒక‌రు. రేవంత్ కోట్లు దండుకుంటూ సీట్లు కేటాయిస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

గ‌ద్వాల్ టికెట్ అమ్ముకున్నాడు

10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్‌ను రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద TPCC సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్ ఆందోళ‌న‌కు దిగారు. నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు చేప‌ట్టారు. 65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణలు చేసారు. తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా… పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారని మండిప‌డ్డారు. (congress)

పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది

రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరుతున్నారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు త‌న‌కు రక్షణ కల్పించాల‌ని రిక్వెస్ట్ చేసారు.

రేవంత్ రెడ్డి TPCCకి అర్హుడు కాదు

TPCC సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్‌లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేశారు. అనంతరం TPCC చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి TPCCకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. (congress)