అవ్వా బువ్వా రెండూ కావాలంటే ఎట్టా?

నాకు అవ్వా కావాలి బువ్వా కావాలి.. అన్న‌ట్లుంది BJP తీరు. తెలంగాణ‌లో (telangana) చేసిన త‌ప్పు త‌మిళ‌నాడులో (tamilnadu) చేయ‌కూడ‌దు అనుకున్నా.. అక్క‌డ కూడా న‌ష్ట‌పోయింది కేంద్ర ప్ర‌భుత్వ‌మే..! క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో (karnataka elections) ఓడిపోయాక‌.. ఇక ద‌క్షిణాదిన మిగిలిన‌ తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాల‌ని BJP చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. తెలంగాణ‌లో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ (bandi sanjay) ఉన్నంతవ‌ర‌కు పార్టీకి పాపులారిటీ బాగానే వ‌చ్చింది. కానీ బండి సంజ‌య్ తీరు బాలేద‌ని.. అత‌ను ఉంటే ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు BJPలోకి రావాల‌నుకున్నా రాలేక‌పోతున్నారని హైకమాండ్‌కు బాగా నూరిపోసారు.

దాంతో ఆయ‌న్ను ప‌క్క‌కు పెట్టి కిష‌న్ రెడ్డికి (kishan reddy) బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే బండి సంజ‌య్‌ను తీసేసాక పార్టీకి ఉన్న కాస్త పాపులారిటీ పోయింది. దాంతో ఇదే త‌ప్పు త‌మిళ‌నాడులో మాత్రం చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకుంది BJP. తెలంగాణ‌లో ప‌రిస్థితి వేరు… త‌మిళ‌నాడులో వేరు. తెలంగాణ‌లో అధికార BRSతో  BJPకి ఎలాంటి పొత్తు లేదు. కానీ త‌మిళ‌నాడులో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన AIAIDMKతో భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తు పెట్టుకుంది.

పొత్తు పెట్టుకున్న‌ప్పుడు అక్క‌డ అధికారం స్థానిక పార్టీదే అవుతుంది. అంటే త‌మిళ‌నాడులో భార‌తీయ జ‌న‌తా పార్టీ AIADMKతో పొత్తుకున్న‌ప్పుడు అన్నాడీఎంకేదే పైచేయి ఉంటుంది. సీట్ షేరింగ్ ప‌వ‌ర్ షేరింగ్ గురించి బాగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటారు. కానీ త‌మిళ‌నాడులో భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నామ‌లై (annamalai) మాత్రం త‌న సొంత ఆట మొద‌లుపెట్టాడు. పొత్తు పెట్టుకున్నామ‌న్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేంద్రంలో అధికారంలో ఉంది తామే కాబ‌ట్టి ఎంత ఎక్కువ‌గా తిడితే అంత బాగా పాపుల‌ర్ అయిపోతామ‌ని అనుకున్నాడో ఏమో.. AIADMK చెందిన సీనియ‌ర్ నేత‌ల‌పై నోటికొచ్చిన‌ట్లు వాగాడు. అప్ప‌టికీ ఎంతో స‌హిస్తూ వ‌చ్చిన అన్నాడీఎంకే పొత్తు వ‌ద్దు ఏమొద్దు అని భార‌తీయ జ‌న‌తా పార్టీకి రాం రాం చెప్పేసింది.

తెలంగాణ‌లో పొత్తు లేదు కాబ‌ట్టి గెలవ‌డం క‌ష్ట‌మే. అలాంట‌ప్పుడు అన్నీ మూసుకుని త‌మిళ‌నాడులో అక్క‌డి ప్రాంతీయ పార్టీ చెప్పిన‌ట్లు న‌డుచుకుని ఉంటే బాగుండేది. ఒక క్ష‌మాప‌ణ చెప్పించినా అయిపోయేది కానీ BJP అది కూడా చేయ‌లేదు. చివ‌రికి న‌ష్ట‌పోయింది ఎవ‌రు అంటే BJPనే..! మేం నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌తాం.. అయినా స‌రే మీరు మాతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సిందే అంటే ఏ పార్టీ మాత్రం స‌హిస్తుంది? ఆత్మాభిమానం అనేది ఉండ‌దా? అందుకే భార‌తీయ జ‌న‌తా పార్టీతో బ్రేకప్ చేసుకుని AIADMK మంచి ప‌ని చేసిందనే చెప్పాలి.