Thummala: KCR బ‌తిమిలాడితే BRSలో చేరా

Telangana Elections: పువ్వాడ పూవులు కావాల్నా.. తుమ్మ ముళ్లు కావాల్నా అని నిన్న KCR ఖ‌మ్మం బ‌హిరంగ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుపై (thummala) సెటైర్లు వేసారు. ఈ సెటైర్ల‌పై తుమ్మ‌ల రియాక్ట్ అయ్యారు. అస‌లు పూజ‌కు ప‌నికిరాని పువ్వులు ఎందుకు అని విమ‌ర్శించారు. పువ్వాడ ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు పార్టీలు మారాడ‌ని.. అలాంటి వ్య‌క్తి కోసం ఈరోజు KCR త‌నను త‌క్కువ చేసి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. KCR ఎప్పుడూ అబ‌ద్ధాలే చెప్తుంటార‌ని విమ‌ర్శించారు.

క‌నీసం తుమ్మ చెట్టుకి నీరు పోయ‌క‌పోయినా పెరుగుతుంద‌ని.. అది ముదిరితే దానితో నాగ‌లి త‌యారుచేసుకుని హాయిగా పొలం దున్నుకోవ‌చ్చ‌ని అన్నారు. KCR మూడు నెల‌ల పాటు త‌న‌ను బ‌తిమిలాడితే BRSలో చేరాన‌ని అలాంటిది ఈరోజు KCR త‌న‌ను ఇలా తుమ్మ చెట్టు అన‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని తెలిపారు. మంత్రి ప‌ద‌వి రాద‌ని పువ్వాడ అజ‌య్ డ‌బ్బులు ఇచ్చి మ‌రీ త‌న‌ను ఓడించారని ఆరోపించారు. ఖ‌మ్మంలో ఎక్క‌డ చూసినా తాను చేసిన అభివృద్ధే క‌నిపిస్తోంద‌ని ఆంధ్ర తెలంగాణ‌లో క‌ట్టిన ప్ర‌తి ప్రాజెక్ట్‌లో త‌న హ‌స్తం కూడా ఉంద‌ని తెలిపారు.