Telangana Elections: అయోమ‌యంలో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు

కాంగ్రెస్ పార్టీలో (congress) తుమ్మల నాగేశ్వరరావు (thummala) చేరికకు బ్రేక్ ప‌డింది. అసెంబ్లీ ఎన్నికలు (telangana elections) లేట్ అవుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు సమాచారం. ఈ నెల 17న తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది. అలాగే పాలేరు సీటు విషయంలో కాంగ్రెస్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడంతో.. తుమ్మల అయోమయంలో పడినట్లు టాక్.