KCR: పార్టీ వీడకుండా ఉండే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది
KCR: భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గ్రహణం పట్టినట్టుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కనీసం లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అయినా సీట్లు గెలవాలని పార్టీ దృఢంగా నిర్ణయించుకుంది. ఇందుకోసమే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేతల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కానీ అవేమీ వర్కవుట్ కావడంలేదు.
ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా వలసలు కొనసాగుతున్నాయి. దాంతో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ స్థానాల్లో ఎవర్ని నిలబెట్టాలో అర్థంకాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వలసలు పోతున్న నేతలకు ఓ మాట చెప్పారు. ఎవరైతే పార్టీలోనే ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తాను గ్యారెంటీ ఇస్తున్నానని అన్నారు. అయితే ఎవరైతే భారత రాష్ట్ర సమితిని వదిలి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్న వారిని మళ్లీ భారత రాష్ట్ర సమితిలోకి రానిచ్చేది లేదని తేల్చిచెప్పేసారు.