EXCLUSIVE: వారికి ఇందిరమ్మ ఇళ్లు లేనట్లే..!
EXCLUSIVE: తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) ఈ అంశంపై గట్టిగా కసరత్తు చేయిస్తున్నారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్ని ఇళ్ల పథకాలపై సీఎం స్టడీ చేయాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ నెలాఖరు కల్లా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గైడ్‌లైన్స్ వచ్చేస్తాయి. నేరుగా గ్రామాల్లోనే అర్హులను ఎంపికచేసి వారికి ఇళ్లు ఇవ్వాలని సీఎం ప్లాన్ వేసారు.