Politician Speeches: ఇప్పుడు ఇదే ట్రెండ్..!
Hyderabad: అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో ఒక పార్టీ మరో పార్టీని విమర్శించుకోవడం చూస్తూనే ఉంటాం. అదే విధంగా ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకోవడం కూడా చూస్తూనే ఉంటాం. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలంటే కేవలం సీరియస్‌గా మాత్రమే మాట్లాడుకోవాలని ఏమీ లేదు. అప్పుడప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందిస్తుంటారు. అయితే ఈ వారంలో ఓ పక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరోపక్క పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. (politician speeches)
అయితే మొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR అసెంబ్లీ సమావేశాల్లో (telangana assembly) మాట్లాడుతూ.. కాంగ్రెస్ (congress) పార్టీని విమర్శించారు. అదేదో టీచర్ నేను చెప్పింది రిపీట్ చేయండి అన్నట్లు.. KTR స్పీచ్ మొదలుపెట్టగానే వెనక కూర్చున్న BRS నేతలు కాంగ్రెస్.. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటూ ఒకేసారి కేకలు వేసారు. (politician speeches)
ఇలాంటి ఘటనే నిన్న పార్లమెంట్ సమావేశంలో (parliament) జరిగింది. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా (amit shah) కాంగ్రెస్ పాల్పడిన అవినీతి చిట్టాను తెరిచి మరీ ఈ స్కాంకి పాల్పడింది ఎవరు? అనగానే వెనక కూర్చున్న BJP నేతలు UPA చేసింది అని ఒకేసారి అరిచారు. దాంతో ఇలాంటి స్పీచ్‌లు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారిపోయాయి. (politician speeches)