Chandrababu Naidu: కోడికత్తి కమల్ హాసన్ కొత్త డ్రామా..!
Chandrababu Naidu: ఈసారి ఆంధ్రప్రదేశ్లో హుద్ హుద్.. తిత్లీని మించిన తుఫాను రాబోతోందని అన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శ్రీకాకుళానికి రాగానే తనకు తన మిత్రుడు దివంగత నేత, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్నాయుడు గుర్తుకొస్తారని అన్నారు. ఇప్పటికే 21 సభల్లో పాల్గొన్నానని.. 22వ సభలో భాగంగా శ్రీకాకుళం వచ్చానని తెలిపారు. (Chandrababu Naidu)
పెద్ద తుఫాను రాబోతోంది
నాకు శ్రీకాకుళం కొత్త కాదు.. నేను ఉత్తరాంధ్రకు రావడం కొత్త కాదు. కానీ ఈ జన స్పందన మాత్రం కొత్తగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడనంత స్పందన ఈసారి కనిపిస్తోంది. దీని అర్థం ఏంటో తెలుసా తమ్ముళ్లూ.. జగన్ పని అయిపోయింది. మార్పు మొదలైంది. మనం హుద్ హుద్ చూసాం. తిత్లీ తుఫాన్ చూసాం.. ఈసారి వచ్చేది అంతకంటే పెద్ద తుఫాను. ప్రభుత్వంపై వచ్చే ఈ తుఫాను ధాటికి YSRCP కొట్టుకుపోతుంది. జగన్ అడ్రస్ గల్లంతు అవుతుంది.
పేదల జీవితాలు ఛిద్రం.. బతుకులు భారం
నేను ఒక్కటే అడుగుతున్నా.. జగన్ దోపిడీ పాలనతో ఎవరి జీవితాలు అయినా మారాయా? ప్రజల జీవన ప్రమాణాలు 1 శాతం అయినా మెరుగయ్యాయా? జగన్ పాలనలో పేదలు మరింత పేదలుగా మారారు. వైసీపీ నాయకులు మాత్రం ధనికులు అయ్యారు. ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు పాలసీలు తెస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం దోపిడీ కోసమే పాలసీలు తెచ్చింది. దీంతో కోట్ల మంది జీవితాలు తలకిందులు అయ్యాయి.
ALSO READ: TDP: తొలి జాబితా.. YSRCPలో భయం మొదలు
పేదల పేరుతో నాటకం.. ప్రతి మాటా బూటకం
అందరినీ పేదరికంలోకి నెట్టేసి జగన్ మళ్లీ తాను పేదల మనిషి అంటూ మాటలు చెప్తున్నాడు. 2019లో ఒక్క ఛాన్స్ డ్రామాతో అధికారంలోకి వచ్చి అందరి జీవితాలు రివర్స్ చేసాడు. ఇప్పుడు పేదల బిడ్డ అని కొత్త డ్రామా మొదలుపెట్టాడు ఈ కోడికత్తి కమల్ హాసన్. నమ్మి ఓటేసిన ప్రజలంతా నేడు జగన్న ప్రశ్నించాలి.. నిలదీయాలి. పేదల నాయకుడివి అయితే 9సార్లు కరెంటు పెంచి మా నడ్డి విరుస్తావా అని ప్రశ్నించండి. గతంలో రూ.200 వచ్చే కరెంట్ బిల్లు నేడు రూ.800 వరకు ఎందుకు వస్తోందో అడగండి.
చర్చకు సిద్ధమా?
జగన్ చెప్పే దానికి చేసే దానికి సంబంధమే ఉండదు. అయితే గొప్ప విషయం ఏంటంటే.. అబద్ధాలు మత్రం జగన్ అద్భుతంగా చెప్తాడు. చేయని వాటిని చేసినట్లు చెప్పుకోవడానికి నాకు తెలిసి జగన్ మాస్టర్ డిగ్రీ చేసాడు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన మళ్లీ ఉత్తరాంధ్రను ఉద్దరిస్తా అని చెప్తాడు. మన హయాంలో మూడు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్ల కాలంలో మొత్తం కలిపి కూడా అందులో మూడో వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే తన సలహాదారులకు, సాక్షి పత్రికకు ఇచ్చిన దాంట్లో సగం కూడా ఉత్తరాంధ్రపై ఖర్చు చేయని జగన్.. మళ్లీ కబుర్లు చెప్తున్నాడు.
తెలుగు దేశం – జనసేన పొత్తు.. YSRCP చిత్తు
తెలుగు దేశం జనసేన పార్టీల సీట్ల ప్రకటనతో YSRCPలో వణుకు మొదలైంది. తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్లుంది. వైసీపీ స్పందన చూస్తుంటేనే మన పొత్తుపై వారెంత భయంతో ఉన్నారో అర్థం అవుతోంది. 1.3 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుని మంచి అభ్యర్ధులను ఎంపిక చేసి సీట్లు ప్రకటించాం. ఒకేసారి 99 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడంతో తాడేపల్లిలో టెన్షన్ మొదలైంది. 175 గెలుస్తామని గొప్పలు పోతున్న వైసీపీ.. మా సీట్లను, మా పొత్తులను చూసి వణికిపోతోంది. మీరు ఇప్పటికీ ఒక్క అభ్యర్ధిని ప్రకటించలేకపోయారు. మేం ఉమ్మడిగా 99 సీట్లు ప్రకటించాం. మన లిస్ట్ చూసి భయపడ్డారు. వెంటనే వైసీపీ నేతలు బయటికి వచ్చి ఇప్పటివరకు వైసీపీ ఇన్ఛార్జ్లుగా ఉన్నవారు అభ్యర్ధులు కారు అని మళ్లీ డ్రామా మొదలుపెట్టారు.