Nara Lokesh: ప్రసన్నా.. ఏందయ్యా ఇది..?
AP: శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులపై లేదేమి ప్రసన్నా అంటూ విమర్శలు గుప్పించారు TDP నేత నారా లోకేష్ (nara lokesh). యువగళం (yuvagalam) పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో పర్యటిస్తున్న లోకేష్ ఎక్కడైతే ప్రభుత్వ లోపాలు ఉన్నాయో వాటితో పాటు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా నిన్న నెల్లూరులోని (nellore) బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన లోకేష్.. అక్కడి ఓ శిలాఫలకం నామారూపాలు లేకుండా ఉండటం చూసి షాకయ్యారు. దీని గురించి ట్విటర్లో ప్రస్తావించారు.
“చిత్తశుద్ధి లేని YCP పాలకుల చర్యలకు అద్దం పడుతోంది ఈ శిలాఫలకం. రూ.2కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి, 25-10-2020 కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. రెండున్నరేళ్లయినా శిలాఫలకం అంత ఎత్తు కూడా భవనం గోడలు లేవలేదు. ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిచి, మురుకి కూపంగా మారింది. YCP ప్రజాప్రతినిధులకు అడ్డగోలు దోపిడీ, శిలాఫలకాలు, రంగులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం ఈ రాష్ట్రప్రజల దౌర్భాగ్యం” అని ట్వీట్లో పేర్కొన్నారు.