Saveera Parkash: ఈ భారతీయ అమ్మాయి పాకిస్థాన్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు?
Saveera Parkash: పాకిస్థాన్‌లో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. 2024 ఫిబ్రవరి 8న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సవీరా పర్కాష్ అనే భారతీయ యువతి పోటీ చేయడం చర్చకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంక్వాలోని బునర్ నియోజకవర్గం నుంచి సవీరా బరిలోకి దిగనుంది.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (pakistan peoples party) టికెట్ నుంచి ఈమె పోటీ చేస్తుండడం గమనార్హం. ఈ పార్టీ పాకిస్థాన్‌లో పుట్టినవారికే టికెట్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ సవీరాకు టికెట్ ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది. సవీరా తండ్రి ఓం ప్రకాశ్ పాకిస్థాన్‌లో డాక్టర్‌గా పనిచేసేవారు. ఆయన దాదాపు 35 ఏళ్ల పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కోసం పనిచేసారు.
అదీకాకుండా బునర్ ప్రాంతం నుంచి ఇప్పటివరకు ఏ మహిళ కూడా పోటీ చేసింది లేదు. అలాంటిది ఈ హిందూ యువతి ఇప్పుడు పోటీ చేయనుంది. ఇది మంచి పరిణామమే అని అక్కడి పలు పార్టీ నేతలు కూడా అంటున్నారు. సవీరా కూడా తన తండ్రిలాగే అబోట్టాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి గ్యాడ్రుయేషన్ పూర్తి చేసింది. బునర్ ప్రాంతంలోని యువతులకు తన వంతు సాయం చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు సవీరా తెలిపింది. పాకిస్థాన్ ఎన్నికల సంఘం మహిళలకు 5% రిజర్వేషన్ కల్పించింది. అయినప్పటికీ ఏ మహిళ కూడా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. సవీరాను చూసైనా ధైర్యం తెచ్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారేమో చూడాలి.