Bypoll Election Results: ఇండియా కూట‌మికి కీల‌కం

దేశ‌వ్యాప్తంగా మొత్తం ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు (bypoll election results) సంబంధించిన తీర్పు నేడు వెల్ల‌డికానుంది. ఇండియా, NDA కూట‌ములు నువ్వా నేనా అని పోటీప‌డుతున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల‌కు ఇండియా కూట‌మికి (india) కీల‌క‌మ‌నే చెప్పాలి.

ఉప ఎన్నిక‌లు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాలు

జార్ఖండ్ – డుమ్రి

కేర‌ళ – పుత్తుప‌ల్లి

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ – ఘోసి

త్రిపుర – బోక్సాన‌గ‌ర్

త్రిపుర – ధ‌న్‌పూర్

ఉత్త‌రాఖండ్ – భ‌గేశ్వ‌ర్

వెస్ట్ బెంగాల్ – ధూప్‌గురి

ముందంజ‌లో BJP

ఈ ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈరోజు ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో (బోక్సాన‌గ‌ర్, ధ‌న్‌పూర్, భ‌గేశ్వ‌ర్, ధూప్‌గిరి) BJP ముందంజ‌లోఉంది. కేవ‌లం కేర‌ళ‌లోని పుత్తుప‌ల్లిలో కాంగ్రెస్ ముందంజ‌లో ఉంది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇత‌ర పార్టీలు ముందంజ‌లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ధూప్‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇక్క‌డ BJPతో పాలు కాంగ్రెస్, CPM, TMC పార్టీలు బ‌రిలోకి దిగాయి. కాంగ్రెస్, CPM, TMC ఇండియా కూట‌మికి చెందిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. (bypoll election results)