Nara Lokesh: AP CID విచారణ ఈ ప్రశ్నలపైనే
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో TDP నేత నారా లోకేశ్ (nara lokesh) AP CID ఎదుట హాజరయ్యారు. తాడేపల్లిలోని CID కార్యాలయానికి చేరుకున్న లోకేష్‌ను అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని CRDAపై ఆయన ఒత్తిడి తెచ్చారని CID ప్రధాన అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో AP CID లోకేష్‌ను ఈ ప్రశ్నల ఆధారంగా విచారిస్తోంది.
ఇన్నర్ రింగు రోడ్డు మార్గంలోనే ఎందుకు హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది?
2014 జులై 30న భూముల కొనుగోలుకు హెరిటేజ్ తీర్మానం చేసిందా లేదా?
లింగమనేని రమేష్‌తో మీకున్న సంబంధాలు ఏంటి?
మూడు సార్లు రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయించారా?
అలైన్మెంట్ మార్పు సమాచారం చంద్రబాబు ద్వారానే మీకు తెలిసిందా?