Delhi Declaration వెనకున్నది వీరే..!
పై ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురినీ చూసారా? భారత రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (g20 summit)లో ఢిల్లీ క్లియరెన్స్ (delhi declaration) సక్సెస్ అవ్వడానికి. మొత్తం సమ్మిట్‌కి వీళ్లే లీడర్‌లు. భారత్ G20 షెర్పాగా (g20 sherpa) బాధ్యతలు తీసుకున్నారు అమితాబ్ కాంత్. టీమ్‌తో కలిసి ఈ సదస్సు సక్సెస్ అయ్యేలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం దాదాపు 200 గంటల పాటు 300 చర్చలు జరిగాయని అమితాబ్ కాంత్ (amitabh kant) వెల్లడించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోయినా చివరకు అది సాధించింది భారత్. ఈ విషయంలో షెర్పా పాత్ర కీలకం.
300 ద్వైపాక్షిక చర్చలు జరిపి 15 డ్రాఫ్ట్‌లు ఈ సదస్సులో ప్రవేశపెట్టారు. ఆ తరవాత వీటన్నింటికీ G20 నేతలు ఆమోద ముద్ర వేశారు. ఈ ఘనత సాధించడంపై తన టీమ్‌ని అమితాబ్ కాంత్ అభినందించారు. ఈ సందర్భంగా స్పెషల్ ట్వీట్ కూడా చేశారు. “” రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సభ్యులందరూ ఏకాభిప్రాయానికి రావడమే అతిపెద్ద సవాలు. కానీ దీన్ని సాధించగలిగాం. ఇందుకోసం 200 గంటల పాటు చర్చలు జరిగాయి. 300 ద్వైపాక్షిక చర్చలు నిర్వహించాల్సి వచ్చింది. ఇదంతా సాధ్యం కావడానికి నా టీమ్ మెంబర్సే కారణం. నాకు అన్ని విధాలుగా సహకరించారు. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు “” అని అమితాబ్ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు. (delhi declaration)