KCR: పార్టీని వదిలి వెళ్లే ఏ ఒక్కరినీ మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదు

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన భార‌త రాష్ట్ర స‌మితికి (BRS) బ్యాక్ టు బ్యాక్ దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు భార‌త రాష్ట్ర స‌మితిని వ‌దిలి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలా స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు పార్టీని వ‌దిలి వెళ్తున్న వారి గురించి తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. ఇప్పుడు పార్టీని వదిలి వెళ్లే ఏ ఒక్కరినీ మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసారు.

కాంగ్రెస్‌, భార‌తీయ జ‌నతా పార్టీల్లోకి అన‌వ‌స‌రంగా చేరాం అని మ‌ళ్లీ భార‌త రాష్ట్ర స‌మితిలోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఇలా ఆలోచించి మ‌ళ్లీ భార‌త రాష్ట్ర స‌మితిలోకి వెళ్దాం అనుకునేవారి గురించి KCR ఇలా స్పందించారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదని ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింద‌ని అన్నారు. కొత్త యువ నాయకత్వం రావాలని.. కింది నుండి మీది వరకు అని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామ‌ని KCR ధీమా వ్య‌క్తం చేసారు.