Kavitha కేసులో ట్విస్ట్.. జ‌రిగిందేంటి?!

Kavitha: ఢిల్లీ లిక్క‌ర్ కేసులో భాగంగా భార‌త రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఈడీ అధికారులు గ‌త శుక్ర‌వారం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాను గ‌తంలో వేసిన పిటిష‌న్ ఇంకా సుప్రీంకోర్టులో విచార‌ణ‌లో ఉండ‌గా.. ఇలా అరెస్ట్ చేయ‌డం స‌బ‌బు కాద‌ని.. త‌న అరెస్ట్ చ‌ట్ట విరుద్ధం అని పేర్కొంటూ శ‌నివారం క‌విత సుప్రీం కోర్టులో మ‌రో పిటిష‌న్ వేసారు. అయితే.. ఈరోజు క‌విత ఆ పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకున్నారు.

పిటిష‌న్ ఫైల్ చేస్తున్న స‌మ‌యంలో తొంద‌ర‌పాటులో కొన్ని త‌ప్పులు దొర్లాయ‌ట‌. దాంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి బేలా ఎం త్రివేది పిటిష‌న్‌ను చ‌దివి త‌ప్పుల త‌డ‌క‌లా ఉంద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. దాంతో ఈరోజు తాను ఫైల్ చేసిన పిటిష‌న్‌ను విత్‌డ్రా చేసుకుని మ‌ళ్లీ కొత్త పిటిష‌న్‌ను వేయాల‌ని క‌విత నిర్ణ‌యించుకున్నారు. ముకుల్ రోహాత్గి, క‌పిల్ సిబాల్ వంటి టాప్ లాయ‌ర్లు క‌విత కేసును డీల్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 23 వ‌ర‌కు క‌విత రిమాండ్‌లో ఉండ‌నున్నారు. ఈలోగా తాజా పిటిష‌న్ వేస్తే సుప్రీంకోర్టు దానిపై విచారించి ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది.

ALSO READ: Sukesh Chandrashekhar: అక్కా.. జైల్లో ఎదురుచూస్తుంటా.. త్వ‌ర‌గా వ‌చ్చేయ్!

ALSO READ: Bhanu Priya: KTRని ఎదిరించి.. క‌విత‌ను అరెస్ట్ చేసిన ఈ లేడీ డాన్ ఎవ‌రు?