Nara Lokesh: లోకేష్‌కి ముప్పు ఉంది.. రాష్ట్ర గవర్నర్‌కి TDP రిక్వెస్ట్

AP: TDP నేత నారా లోకేష్‌కు (nara lokesh) ముప్పు ఉందని, ఆయ‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని ప‌లువురు TDP నేత‌లు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్‌ను రిక్వెస్ట్ చేసారు. ఆయ‌న ప్ర‌స్తుతం యువ‌గ‌ళం (yuvagalam) పాదయాత్ర చేస్తున్నారు కాబ‌ట్టి ప‌టిష్ఠ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని విన్నవించారు. ప్రొద్దుటూరులో లోకేష్ పాద యాత్ర చేస్తున్న‌ప్పుడు ఓ దుండ‌గుడు ఆయ‌న‌పై కోడి గుడ్డు విసిరాడు. అత‌ను YCP వ్య‌క్త‌న్న అనుమానం ఉంద‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. పాద‌యాత్ర అయ్యేలోపు లోకేష్‌కు ఏం జ‌రిగినా దానికి కార‌ణం ఏపీ సీఎం జ‌గ‌నేన‌ని (ap cm jagan) హెచ్చ‌రించారు.