TTD: ఒకటి కాదు మొత్తం 4 పులులు ఉన్నాయ్
Hyderabad: తిరుమల (ttd) నడకదారిలో చిన్నారి లక్షితను చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించినట్లు TTD ఈవో ధర్మారెడ్డి (dharma reddy) తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం జరిగే TTD హైలెవల్ మీటింగులో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
తిరుమల (tirumala) అలిపిరి కాలి నడక దారిలో లక్షిత అనే చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట లక్షితపై ఎలుగుబంటి దాడి చేసిందని పోలీసులు అనుమానించారు. కానీ దాడి చేసింది పులి అని తర్వాత తెలిసింది. నిన్న పులి సంచరిస్తున్న ప్రదేశంలో అధికారులు పెట్టిన బోనులోకి ఓ పులి వచ్చి చిక్కింది. ఇంకో మూడు పులులను కూడా త్వరలో పట్టుకుంటామని అప్పటివరకు భక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని ధర్మారెడ్డి తెలిపారు.