Dhanpal Suryanarayana: నిజామాబాద్ అర్బ‌న్ BJPదేనా?

Dhanpal Suryanarayana: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక 2014లో ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు KCR కార‌ణంగానే తెలంగాణ వ‌చ్చింద‌న్న భ్ర‌మ‌లో నిజామాబాద్ అర్బ‌న్ వాసులు TRS (ఇప్పుడు BRS) అభ్య‌ర్ధి బీగాల గ‌ణేష్ గుప్తా (bigala ganesh gupta) చేతికి అధికారం ఇచ్చారు. అప్ప‌టికే BRS గాలి బాగా వీస్తున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కూడా KCR ప్ర‌భుత్వానికే స‌పోర్ట్ చేసారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో అప్పుడే రాష్ట్రం ఏర్ప‌డ‌టంతో గ‌ణేష్ గెలిచేసారు. ఆ త‌ర్వాత 2018 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు BJP అభ్య‌ర్ధికి వేయాల‌నే నిర్ణ‌యించుకున్నారు. కానీ మెజారిటీ ఓట‌ర్లు తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక వ‌చ్చిన తొలి ఎన్నిక‌ల్లో ఏమీ చేయ‌లేక‌పోయినా ఇంకోసారి గెలిపిస్తే అన్నా త‌మ‌కు అంతా మంచే చేస్తార‌ని అనుకున్నారు. అలా 2018లోనూ బీగాల గ‌ణేష్‌నే ఎన్నుకున్నారు.

రెండు సార్లు దెబ్బ‌ప‌డ్డాక ఇక ప్ర‌జ‌ల‌కు బుద్ధి వ‌చ్చింది. ఓటు హ‌క్కును తేలిక‌గా తీసుకుని అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చే వారికి వేస్తే బుగ్గిపాల‌య్యేది త‌మ జీవితాలే అన్న జ్ఞానం వ‌చ్చింది. ఇప్పుడు నిజామాబాద్ అర్బ‌న్ ఓట‌ర్ల చూపు BJP నుంచి బ‌రిలోకి దిగిన ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ గుప్తా (dhanpal suryanarayana gupta) వైపే ఉంది. మైనారిటీల మ‌ద్ద‌తు కూడా సూర్య‌నారాయ‌ణకే ఉండ‌టంతో ఈసారి ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ప్ర‌జ‌లు కూడా సూర్య‌నారాయ‌ణ తమ‌కు ఎప్పుడు సాయం కావాల‌న్నా కుద‌ర‌దు అని ఏనాడూ చెప్ప‌లేద‌ని.. క‌ష్ట స‌మ‌యాల్లో ఆదుకున్నార‌ని చెప్తున్నారు.

సూర్య‌నారాయ‌ణ మొద‌టి నుంచి BJPతోనే ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. అయినా కూడా సూర్య‌నారాయ‌ణ ప్ర‌జ‌లకు త‌న ట్ర‌స్ట్‌ల ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూనే ఉన్నారు. కానీ BJP హైక‌మాండ్ 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను దృష్టిలో పెట్టుకుని 2018లో సూర్య‌నారాయ‌ణ‌కు టికెట్ ఇవ్వ‌లేదు. ఆయ‌న‌కు ఇచ్చి ఉంటే అప్పుడే ఆయ‌న త‌న స‌త్తాను నిరూపించుకునేవారు. ఈ విష‌యం ఇప్పుడు BJP హైక‌మాండ్‌కి కూడా అర్థ‌మైపోయింది. అందుకే ఈ ఎన్నిక‌ల్లో సూర్య‌నారాయ‌ణ‌కు టికెట్ ఇచ్చింది.

బీగాల గ‌ణేష్ ఓట్ల కోసం ఏ అబ‌ద్ధ‌పు హామీలైతే ఇచ్చారో అవ‌న్నీ తాను చేసి చూపిస్తాన‌ని సూర్య‌నారాయణ అంటున్నారు. దాంతో నిజామాబాద్ అర్బ‌న్ వాసుల్లో ఆయ‌న‌పై నమ్మ‌కం మ‌రింత పెరిగింది. దాంతో ఓట‌ర్ల మ‌ద్ద‌తు సూర్య‌నారాయ‌ణ‌కే ఉంద‌ని స్థానికులు కూడా చెప్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెల జీతం కూడా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం ఖ‌ర్చు చేస్తానని సూర్య‌నారాయ‌ణ చెప్పార‌ని.. ఇలాంటి నిస్వార్ధ‌మైన అభ్య‌ర్ధిని గెలిపిస్తే త‌మ బ‌తుకులు బాగుప‌డుతాయ‌ని అనుకుంటున్నామ‌ని స్థానిక ఓటర్లు వెల్ల‌డించారు. ఓట‌ర్ల మాట‌ల్ని బ‌ట్టి చూస్తే ఈసారి మెజారిటీ ఓట్ల‌తో BJP నుంచి ధ‌న్‌పాల్ సూర్య‌నారాయ‌ణ గుప్తా గెలుపు ఖాయం అని స్ప‌ష్ట‌మ‌వుతోంది.