Congress: చాదస్తం, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో రాహుల్‌కి పెద్ద బొక్క పెట్టేసారుగా..!
Congress: ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మన బలాలు బలహీనతలు ఏంటి.. ప్రత్యర్ధి పార్టీలు ఏం చేస్తున్నాయి.. పార్టీ హై కమాండ్ ఏం ఆలోచిస్తోంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ఎంతో అవసరం. అది వదిలేసి మేం సీనియర్లం మాకు ఎవరి సలహాలు స్ట్రాటెజీలు అవసరం లేదు అనుకుంటే బొక్క బోర్లా పడిపోతారు. ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగింది.
ఎన్నికలకు వెళ్లిన ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరాం, మధ్యప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వీటిలో నిన్న రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఫలితాలు వెలువడ్డాయి. BJP మూడు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోగా కాంగ్రెస్ తెలంగాణతో మాత్రమే సరిపెట్టుకుంది. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడానికి ముఖ్య కారణం సునీల్ కనుగోలు (sunil kanugolu). ఇతను కర్ణాటకకు చెందిన పోల్ స్ట్రాటజిస్ట్. ఇతని ప్లానింగ్ వల్లే కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది.
కర్ణాటకలో సునీల్ ప్లానింగ్ వర్కవుట్ అయింది కాబట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆయన ప్లానింగ్‌నే ఫాలో అవ్వాలనుకుంది. తెలంగాణలో సునీల్ కనుగోలు చెప్పినట్లు ఫాలో అవ్వడానికి ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఒప్పుకున్నారు. కానీ ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో మాత్రం అక్కడి కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ సీఎంలు అయిన అశోక్ గెహ్లోత్, కమల్‌నాథ్‌లు ఒప్పుకోలేదు. సునీల్ ప్లానింగ్ అవసరం లేదని.. మీరు తెలంగాణపై ఫోకస్ చేయండి.. మేం రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ చూసుకుంటామని ధీమాగా చెప్పారు.
తీరా చూస్తే వారి ప్లానింగ్ వర్కవుట్ కాలేదు. బొక్క బోర్లా పడ్డారు. దాంతో మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ సీట్లు కూడా BJPకే దక్కాయి. అలా 12 రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించి ఉండగా.. కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలతోనే సరిపెట్టుకుంది. ఇక 2024లో లోక్ సభ ఎన్నికల్లో (lok sabha elections) BJP హ్యాట్రిక్ కొట్టబోతోందని క్లియర్‌గా తెలుస్తోంది. సునీల్ కనుగోలు చెప్పినట్లు విని ఉంటే రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ గెలిచేదేమో..! కానీ వయసులో తాము పెద్ద కాబట్టి బయటి వారి ప్లాన్లు విని నడుచుకోవాల్సిన అవసరం తమకు లేదనే ఓవర్ కాన్ఫిడెన్స్ రాహుల్ గాంధీకి పెద్ద బొక్క పెట్టిందనే చెప్పాలి.