పేరు చంద్రబాబు.. నేరం ఏపీని బాగుచేయడం
చంద్రబాబు నాయుడుని (chandrababu naidu) వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్ట్ చేయించారని ఎవ్వరూ మర్చిపోవద్దు అంటూ ట్వీట్ చేసారు నారా లోకేష్ (nara lokesh). విజన్ ఉన్న నేతను అరెస్ట్ చేయిస్తే రాష్ట్రం బాగుపడిపోతుందని అనుకుంటున్నారని అన్నారు.
ఒకవేళ ఏపీ బాగుపడితే.. పేదలంతా ధనికులైపోతే ఏపీ సీఎం జగన్ ఎవరిని దోపిడీ చేస్తాడు?
లా అండ్ ఆర్డర్ బాగున్నప్పుడు సపోర్టర్లు మహిళలపై ఎలా దాడులు చేస్తారు?
యువతకు ఉద్యోగాలు దొరికితే వారి భవిష్యత్తు బాగుంటే చీప్ లిక్కర్, డ్రగ్స్‌పై ఆధారపడే అవకాశం ఎవరికి ఉంటుంది? అని ప్రశ్నలు గుప్పించారు లోకేష్.
Name: Chandrababu Naidu
Crime: Developing Andhra PradeshLet there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh.
The question…
— Lokesh Nara (@naralokesh) October 12, 2023