Kiran Kumar Reddy: అందుకే PCC పదవి వద్దనుకున్నా

vijayawada: పదవుల కోసం కాకుండా.. తాను తిరిగి యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చి ప్రజల మధ్య ఉండేందుకే బీజేపీలో చేరినట్లు మాజీ సీఎం(ap ex cm) నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి(nallari kiran kumar reddy) తెలిపారు. తన సేవలు పార్టీకి ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. విజయవాడలోని భాజపా కార్యాలయం(vijayawada bjp office)లో నిర్వహించిన మీడియా సమావేశం(press meet)లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్(congress)ను బలోపేతం చేయడానికి పని‌ చేయాలని చూశానని.. కానీ అక్కడ నిర్ణయాలు ఒక్కో రాష్ట్రంలో పార్టీ దెబ్బతినేలా ఉన్నాయని కిరణ్‌ కుమార్‌ తెలిపారు. తనకు, రాహుల్ గాంధీ(rahul gandhi)కి మధ్య కొన్ని అంశాలపై చర్చ జరిగిందని. పీసీసీ(pcc post) అధ్యక్షుడి పదవి కూడా ఇస్తామన్నారు.. కానీ తానే వద్దనుకున్నానని పేర్కొన్నారు. ”నీళ్ల బాటిల్ కింద పడకముందే జాగ్రత్త పడాలి అదే నేను చేశా.. ఒక్కసారి కింద పడ్డాక.. మళ్లీ ఆ నీళ్లను సీసాలో పోయలేం అనే‌ విషయాన్నే వాళ్లకి చెప్పా’ అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమయంలో టిడిపితో పొత్తుకు వెళ్లారని.. ఎవరినీ అడగకుండా, చర్చించకుండా నిర్ణయాలు వల్ల బయటకి వచ్చా” అని ఆయన తెలిపారు. మోడీ‌(pm modi) పాలన నచ్చి… ప్రజలకు మంచి చేయవచ్చనే నమ్మకంతో‌ బిజెపి(bjp)లో‌ చేరానన్నారు.