సన్యాసం తీసుకున్న దత్త పుత్రుడితో బెడ్‌రూంలో దొరికిపోయిన మహిళా నేత
Thailand: సన్యాసం తీసుకున్న దత్తపుత్రుడితో ఓ మహిళా నేత ఎఫైర్ పెట్టుకోవడం థాయ్‌లాండ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆమె ఎఫైర్‌ను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వారి ఫోటోలు బయటపడ్డాయి. థాయ్‌లాండ్‌కి చెందిన 45 ఏళ్ల ప్రాపపోర్న్ అనే రాజకీయ నాయకురాలు 24 ఏళ్ల ఫ్రా మహా అనే దత్త పుత్రుడితో బెడ్‌రూంలో అడ్డంగా దొరికిపోయింది.
ప్రాపపోర్న్ భర్తకు వీరి ఎఫైర్ గురించి ఎప్పటినుంచో సందేహం ఉంది. సమయం వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలనుకున్నారు. మొత్తానికి వారు అడ్డంగా దొరికిపోవడంతో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు. అయితే ప్రాపపోర్న్‌ను దత్త పుత్రుడితో చూడగానే ఆమె భర్త ఇప్పుడు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారా అంటూ కేకలు వేయడం వీడియోలో రికార్డ్ అయ్యింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. తామిద్దరం శృంగారంలో పాల్గొనలేదని.. జస్ట్ మాట్లాడుకుంటున్నామని తెలిపింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో వివాదాస్పదంగా మారింది. సమాజం ఎటు పోతోందో తెలీడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె రాజకీయ నాయకురాలిగా పనికిరాదు అంటూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్ని వార్తలను చూసేందుకు https://telugu.newsx.com/ అని టైప్ చేయండి