Telangana Elections: 2018తో పోలిస్తే తగ్గిన‌ పోలింగ్ శాతం

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈరోజు ఉద‌యం 7 గంట‌ల నుంచే 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ మొద‌లైపోయింది. 9 గంట‌ల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం 7.78%. 2018తో పోలిస్తే ఇది మ‌రీ త‌క్కువ అనే చెప్పాలి. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో 9 గంట‌ల స‌మ‌యానికి పోలింగ్ శాతం 8.52%. స‌మ‌యం గ‌డిచే కొద్దీ పోలింగ్ శాతం పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి.