Telangana: పొన్నం, శ్రీధర్ బాబు మ‌ధ్య నామినేటెడ్ ప‌ద‌వుల చిచ్చు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పంపిణీ కార్యక్రమం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రాజేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టేముందు త‌న‌ను సంప్రదించలేదంటూ గుర్రుగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్..(Ponnam Prabhakar) జిల్లాకు చెందిన మరో మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సన్నిహితులకే పదవులు దక్కాయని ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది త‌న‌ను పట్టించుకోవడం లేదు అని పొన్నం మండిపడుతున్నారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నేరెళ్ల శార‌ద‌, కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించే ప్రయత్నం చేసారని అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఎలా కట్టబెడతారని సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న దీపా దాస్ మున్షీ వద్ద పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.