అర్ధరాత్రి తెలంగాణ ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియోకాల్
Telangana: తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు నగ్న వీడియో కాల్ రావడం కలకలం సృష్టించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియోకాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగా ఫోన్ స్క్రీన్‌పై నగ్నంగా ఓ మహిళ ప్రత్యక్షమైంది. వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది.