కేటీఆర్‌పై వ్యాఖ్యలు.. కొండా సురేఖపై హైకోర్టు ఆగ్రహం
Konda Surekha: మంత్రి కొండా సురేఖపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ BRS నేత KTR కాపురాలు కూల్చారు.. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం అయ్యారు అని షాకింగ్ వ్యాఖ్యలు చేయడంతో KTR రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసారు. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సురేఖను ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, యుట్యూబ్ , ఫేస్ బుక్, గూగుల్ ప్లాట్ ఫాంల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. సురేఖ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోర్టు కోరింది.