Gadala Srinivas Rao: కొత్త‌గూడెంలో రావ‌ణాసురుడు..!

Hyderabad: కొత్తగూడెం BRS పార్టీలో అంతర్గత కుమ్ములాట మొద‌లైంది. రామాయణంలో రావణాసురుడు ఉన్నట్లు కొత్తగూడెంలో కూడా ఓ రావణాసురుడు ఉన్నాడు అంటూ అధికార BRS పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై (vanama venkateshwara rao) తీవ్ర అరోపణలు చేసారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు (gadala srinivas rao). శుక్రవారం పోడు భూముల పంపిణీకి కోస‌మ‌ని మంత్రి హ‌రీష్ రావు (harish rao) పాల్వంచకు వ‌చ్చారు. ఈ సందర్భంగా GSR ట్రస్ట్ పేరిట గడల శ్రీనివాసరావు ఫ్లెక్సీలను ఏర్పాటుచేసారు. అయితే వ‌న‌మా ఆదేశాలతో మున్సిప‌ల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీల‌ను తీసేసార‌ని శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు.