avinash reddy: సీబీఐ విచారణ రేపటికి వాయిదా.. అరెస్టు నుంచి సేఫేనా?

Hyderabad: మాజీ మంత్రి వివేక హత్య కేసు(viveka murder case)లో మరో కీలక ఘటన చోటుచేసుంది. ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డి(mp avinash reddy)కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన ఇవాళ ఉదయం హైదరాబాద్‌(hyderabad)కు చేరుకున్నారు. ఈక్రమంలో తనను సీబీఐ(cbi) అరెస్టు చేస్తుందేమోనని భావించిన అవినాష్‌.. హైకోర్టులో పిటిషన్‌(high court petition) దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అవినాష్‌ను విచారణ నిమిత్తం రేపు 4 గంటలకు పిలవాలని సూచించింది. బెయిల్‌ పిటిషన్‌పై రేపు ఉదయం కోర్టు పరిశీలిస్తుందన్నారు.

అవినాష్‌ బెయిల్ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది, సీబీఐ లాయర్‌ తెలంగాణ హైకోర్టుకు తమ వాదనలు వినిపించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి(ys bhaskar reddy)ని అక్రమంగా అరెస్ట్ చేశారని.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసిందని.. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుందని అవినాష్‌ తరపు న్యాయవాది తెలిపారు. అదేవిధంగా సీబీఐ దస్తగిరిని బెదిరించి, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని.. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడన్నారు. వివేకా హత్య కేసు అన్ని కోణాల్లో విచారించి హత్య ఎవరో చేశారో తేల్చాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరారు.

దీనిపై స్పందించిన సీబీఐ తరపు న్యాయవాది.. విచారణకు పిలిచినప్పుడల్లా అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అవినాష్‌ రెడ్డి ఎందుకు ఆందోళన చెందుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ పోలీసులకు ఫోన్ చేశారని. ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్స్ పంపండి చాలు అని చెప్పారు. అంతేకాదు.. గుండెపోటుతోనే వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారు. సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ కీలక పాత్ర పోషించారని ఆయన వాదనలు వినిపించారు.