Telangana: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రం (telangana) మరో భారీ పెట్టుబడిని దక్కించుకుంది. తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దుబాయ్‌కి చెందిన నాఫ్కో (naafco) సంస్థ ముందుకొచ్చింది. ఏకంగా రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు BRS వెల్లడించింది.
దుబాయ్‌లో మంత్రి KTR పర్యటన సఫలీకృతమైనందుకు పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. నాఫ్కో సంస్థ KTRతో జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ (Khalid Al Khatib, NAFFCO CEO) ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని NAFFCO తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (telangana)
దీంతోపాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100 కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ CEO KTRకి తెలియజేశారు. (telangana)