Telangana Elections 2023: 2014 వ‌ర్సెస్ 2018

న‌వంబ‌ర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిక‌లు (telangana elections 2023) జ‌ర‌గనున్నాయి. ఈరోజే అధికార BRS పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోని విడుద‌ల చేసింది. మూడోసారీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని కాన్ఫిడెంట్‌గా ఉంది. BRSకి ఇప్పుడున్న రెండే రెండు ప్ర‌త్య‌ర్ధి పార్టీలు కాంగ్రెస్, BJP. ఇప్పుడు జ‌న‌సేన (janasena), వైఎస్సార్ తెలంగాణ పార్టీలు (YSRTP) కూడా బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఈ రెండు పార్టీలు మొద‌టిసారి బ‌రిలోకి దిగుతున్నాయి కాబ‌ట్టి వీటిని ఎవ్వ‌రూ అంత సీరియ‌స్‌గా తీసుకోవడంలేదు.

హైద‌రాబాద్ సీట్ల‌పై వారి క‌న్ను

హైద‌రాబాద్‌లో.. హైద‌రాబాద్ చుట్టూ ముఖ్య‌మైన 24 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. మ‌న‌కు హైద‌రాబాద్ ఐటీ కారిడార్. వివిధ రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు ఇక్క‌డ స్థిర‌ప‌డ్డారు. వారిలో కొంద‌రు ఇక్క‌డే ఓటరు కార్డును కూడా క‌లిగి ఉన్నారు. కాబ‌ట్టి BJP, కాంగ్రెస్, జ‌న‌సేన‌ల క‌న్ను హైద‌రాబాద్‌లోని నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉంది. (telangana elections 2023)

2014 వ‌ర్సెస్ 2018

2014లో తెలుగు దేశం పార్టీ హైద‌రాబాద్‌లోని 24 నియోజ‌క‌వ‌ర్గాల నుంచి 15 సీట్లు గెలుచుకుంది. కానీ 2018లో మాత్రం ఆ సీట్లు BRSకు వెళ్లాయి. ఈ షిఫ్ట్ అత్యంత కీల‌కంగా మారింది.

గోషామ‌హల్ సీట్

స‌స్పెండ్‌కు గురైన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నియోజ‌క‌వ‌ర్గం ఇది. టికెట్ ఇవ్వ‌క‌పోతే ఒంట‌రిగానైనా పోటీ చేస్తాన‌ని శ‌ప‌థం చేసారు కానీ ప్రాణం పోయినా వేరే పార్టీలో మాత్రం చేర‌ను అని తెగేసి చెప్పేసారు. హైద‌రాబాద్‌లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో గోషామ‌హ‌ల్ సీటు కీల‌క‌మైన‌ది.

BJP పెర్ఫామెన్స్

2014 ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ నుంచి BJP నాలుగు సీట్లు గెలుచుకుంది. 2018లో ఆ సీట్లు కూడా BRS వ‌శమయ్యాయి. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఆ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో BJP మ‌ళ్లీ పుంజుకుంటుందో లేదో చూడాలి. (telangana elections 2023)

ఓల్డ్ హైద‌రాబాద్

ఓల్డ్ హైద‌రాబాద్‌లో BRSకి స‌న్నిహిత పార్టీ అయిన AIMIMదే హ‌వా ఉంది. ఈ సీట్లు కూడా ముఖ్య‌మే.

ఖ‌మ్మం

ఈ ప్రాంతంలో 7 రిజ‌ర్వ్‌డ్ సీట్లు ఉన్నాయి. 2018 ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు కాస్త ట్రెండ్ మార్చి BRSకి ఓట్లు వేసారు.

కామారెడ్డి

గ‌జ్వేల్ నుంచి కాకుండా ఈసారి కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని KCR ప్ర‌క‌టించారు. కాబ‌ట్టి ఈ సీటు అత్యంత కీల‌కం. ఇక్క‌డ కాంగ్రెస్ పోటీ కూడా కాస్త గ‌ట్టిగానే ఉంది.

BRS వ‌ర్సెస్ BJP

కొన్ని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 2018లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు 2019లో జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో చాలా తేడా ఉంది. ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉన్నాయి అనే దాని బ‌ట్టి తెలంగాణ‌లో BJP భ‌విష్య‌త్తు ఏంటని తెలిసిపోతుంది. (telangana elections 2023)