Telangana: త్వరలో ఇందిరమ్మ ఇళ్లు.. షరతులు ఇవే
Telangana: మెల్లిగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఫోకస్ చేస్తోంది. ఈ దఫాల్లో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. మొదటి దఫాలో సొంత స్థలం ఉన్నవారికి నిధులు కేటాయిస్తారు. వీరికి రూ.5లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది. రెండో దఫాలో ఇళ్ల స్థలాలు లేనివారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు. ఇక ఇంటి డిజైన్‌కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
షరతులు ఇవే
ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డులు తెలంగాణకు చెందినవే ఉండాలి
సొంత ఇల్లు ఉండకూడదు. ఆల్రెడీ సొంత ఇల్లు ఉండి.. మళ్లీ ఇంకో ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కుదరదు
తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారికి కానీ వారి ఇంట్లో వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉండకూడదు
ఇందిరమ్మ ఇల్లు తీసుకోవాలనుకునేవారు వారి ఇంట్లో మహిళలే ఇంటి పెద్దగా ఉండాలి.